latest gold rates|రోజురోజుకూ బంగారం ధ‌ర‌లు పైపైకి..

latest gold rates|రోజురోజుకూ బంగారం ధ‌ర‌లు పైపైకి..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారతీయ మ‌హిళ‌ల‌కు బంగారం అంటే ప్రాణం. దానిని కొనుగోలు చేయ‌డానికి ఆడ‌వారు ఆస‌క్తి చూపుతారు. ఏదైనా ఫంక్ష‌న్ ఉంటే చాలు బంగారు ఆభ‌ర‌ణాలు అలంక‌రించుకోవ‌డం ఆడ‌వారికి ఎంతో ఇష్టం. అలాగే పండ‌గ‌లు, శుభ‌కార్యాలు, వివాహాది వేడుక‌ల‌కు బంగారు కొనుగోళ్లు త‌ప్ప‌నిస‌రి. అయితే బంగారు ధరలు ఎంత పెరిగినా కొనుగోలుదారులు కొన‌డం మాత్రం ఆప‌రు. పెళ్లిళ్ల సీజ‌న్‌లో బంగారం కొనాల్సిందే. ఈ స‌మ‌యంలో ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో కొనుగోలుదారులు ఆందోళ‌న చెందుతున్నారు. బంగారం కొన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. కొనాలంటే రేట్లు చూస్తే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.

అంతర్జాతీయ పరిణామాల క్రమంలో గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ వారంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. సోమవారం నుంచి ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. దీంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో పసిడి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రేట్లు పెరగడం బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,55,570 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.1,55,350 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోల్చుకుంటే రూ.220 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,600 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.1,42,400 వద్ద కొనసాగింది. నిన్నటితో చూస్తే రూ.200 పెరిగింది.

ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,70,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.70 లక్షలుగా ఉంది. ఇక హైద‌రాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2,75,100 వద్ద ఉండగా.. నిన్న రూ.2.75 లక్షల వద్ద ఉంది. అటు చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2,75,100 వద్ద కొనసాగుతున్నాయి.

Leave a Reply