మేడ్చల్ – ఘనపూర్తా గునీటి సరఫరా లైన్ల తనిఖీ….

మేడ్చల్ – ఘనపూర్తా గునీటి సరఫరా లైన్ల తనిఖీ….
లోపాలను సరిదిద్ది ప్రజలకు నీటి కష్టాలు తీర్చాలని అధికారులకు డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ఆదేశం…..
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ బుధవారం రోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆయన ఘనపూర్ నుండి మేడ్చల్ వరకు ఉన్న ప్రధాన తాగునీటి సరఫరా లైన్లను HMWS&SB మిషన్ భగీరథ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు.
పరిశీలనలో భాగంగా పైప్‌లైన్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్న కమిషనర్, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. లీకేజీల గుర్తింపు పైప్‌లైన్లలో ఉన్న లోపాలు, లీకేజీల వల్ల నీరు వృథా అవుతున్నట్లు గుర్తించి, వాటికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, సరఫరాలో ఉన్న సాంకేతిక లోటుపాట్లను వెంటనే సరిచేయాలని సూచించారు. తక్షణమే ఉపశమన చర్యలతో పాటు, భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు.

”ప్రజలకు నిరంతరాయంగా శుద్ధమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఇందులో నిర్లక్ష్యం వహించే ప్రసక్తే లేదు. సుధాంష్, డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. అధికారులతో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నీటి సరఫరా సమస్యలపై సమగ్రంగా చర్చించి, క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి తాగునీరు చేరేలా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ మహేందర్, ఏఈ శ్రీదేవి, HMWS&SB ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఈఈ ప్రమీల తో పాటు ఇతర మున్సిపల్ జలమండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

