రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మాధవ రెడ్డి

రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మాధవ రెడ్డి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మక్కజొన్న పంట దగ్ధం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన ఘటన మూడు చెక్కలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, వ్యవసాయ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన వారు, రైతులు అధైర్యపడవద్దు.. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సూచనల మేరకు జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక తయారు చేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఎమ్మెల్యే సహకారంతో తగిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ దామోదర్ రెడ్డి, ఎమ్మార్వో కృష్ణ, నల్లబెల్లి వ్యవసాయ అధికారి రజిత, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిట్యాల తిరుపతి రెడ్డి,నర్సంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, జిల్లా సభ్యులు మునీందర్, మండల కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బౌసింగ్, కాంగ్రెస్ నాయకులు చిట్యాల ఉపేందర్ రెడ్డి, నల్లగొండ సుధాకర్, వేముల సంపత్ రెడ్డి, వెంగళ దాస్, జంగిలి మోహన్, పోగుల కుమారస్వామి, వైనాల పవన్, రఫీద్ నాయక్, సర్పంచ్ భూక్య భాస్కర్ రమణ, గ్రామ అధ్యక్షుడు రమేష్ నాయక్, వెంకన్నతో పాటు రైతులు పాల్గొన్నారు.
