ఆర్టిజన్ కార్మికులను విలీనం చేయాలి

ఆర్టిజన్ కార్మికులను విలీనం చేయాలి

  • టీవీఏఈ సంగారెడ్డి సర్కిల్ అధ్యక్షుడు రవీందర్

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: విద్యుత్ ఆర్టిజన్ కార్మికులను వెంటనే విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని టీవీఏఈ సంగారెడ్డి సర్కిల్ అధ్యక్షుడు రవీందర్ డిమాండ్ చేశారు. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా కీలక సేవలు అందిస్తున్నప్పటికీ, ఇప్పటికీ వారికి స్థిరమైన ఉద్యోగ భద్రత కల్పించలేదని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిరవధిక దీక్ష 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016 వరకు అర్హులైన ఆర్టిజన్లను వెంటనే విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా నిర్వహణలో ఆర్టిజన్ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని, కానీ వారిని కాంట్రాక్ట్ విధానంలో కొనసాగించడం అన్యాయమని అన్నారు. వెంటనే వారిని విద్యుత్ సంస్థలో విలీనం చేసి, శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం.శివరాజ్, పి. ప్రదీప్ చౌదరి, పి.మురళీ మోహన్, ఫిరోజ్, హేమ, లక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply