అంబేద్కర్ జయంతి సందర్బంగా ఖిలాషాపురంలో సేవా కార్యక్రమాలు

అంబేద్కర్ జయంతి సందర్బంగా ఖిలాషాపురంలో సేవా కార్యక్రమాలు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ రాణి రుద్రమ సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
కార్యక్రమంలో భాగంగా రక్తదానం శిబిరం, కంటి పరీక్షలు, మెగా హెల్త్ క్యాంప్, డెంటల్ క్యాంప్ నిర్వహించారు. అదేవిధంగా గ్రామ ప్రజల కోసం చలివేంద్రం ప్రారంభించి, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జ్ఞాన యాత్ర కూడా నిర్వహించి, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేశారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ శాగ కవిత అశోక్ పాల్గొన్నారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు మహిపాల్ రెడ్డి, జీడికంటి రాజ్ కుమార్, జిట్టే వీరస్వామి, కోడిదేటి శంకర్, ముప్పిడి శ్రీనివాస్, మస్సి చంద్రమౌళి, అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు శాగ అరుణ్, కార్యదర్శులు శాగ భాలకృష్ణ, నాగేష్, ఉపేందర్, రంజిత్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
