Praful | ఒకే మ్యాచ్‌తో 4వేల నుంచి 3 లక్షల ఫాలోవర్లు

Praful | ఒకే మ్యాచ్‌తో 4వేల నుంచి 3 లక్షల ఫాలోవర్లు
Praful | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనతో ఒక్కరాత్రిలోనే సోషల్ మీడియాలో స్టార్‌గా మారాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అతని కెరీర్‌ను మలుపుతిప్పింది.
ఐపీఎల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ప్రఫుల్ హింగే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు ముందు అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు కేవలం 4 వేల మంది మాత్రమే ఉండగా, మ్యాచ్ అనంతరం ఆ సంఖ్య 3 లక్షలకు పైగా చేరింది.
ఈ మ్యాచ్‌లో ప్రఫుల్ హింగే అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు మొత్తం నాలుగు వికెట్లు సాధించి ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతని ప్రదర్శనకు గుర్తింపుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల్లో ప్రఫుల్ హింగే పేరు మార్మోగుతోంది.
