అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్…

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ నాయకులు పేర్కొన్నరు. మంగళవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పదవి విరమణ చేసిన సీనియర్ నాయకులు జయప్రకాష్ జిల్లా అధ్యక్షుడు సోమేసుల చంద్రశేఖర్, డీసీ ఈ బి చైర్మన్ గంగుల శ్రీనివాసరెడ్డి, కార్యాలయం అధ్యక్షుడు సుబ్బయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసరావు భాస్కర్ రెడ్డి తిరుపతయ్య, ప్రసాదు, ప్రభాకర్, హెగ్డే సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. కుల రహిత సమాజం కోసం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. నేటి యువత అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ​

అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే పరిమితం కాదని, భారతదేశ గతిని మార్చిన మహనీయుడని వారు స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్య, ఉపాధి కోసం ఆయన చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు.

Leave a Reply