Tragic incident | చికిత్స పొందుతూ మృతి

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా మానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్‌ఐ గోవింద్ నాయక్‌ను పోలీసు వాహనం ఢీకొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ గోవింద్ నాయక్‌ను పోలీసు వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.
స్టేషన్ ఎదుట నిలబడి ఉన్న సమయంలో హోంగార్డు రామారావు నడుపుతున్న వాహనం నియంత్రణ కోల్పోయి ఆయనపైకి దూసుకెళ్లినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన గోవింద్ నాయక్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఘటన అనంతరం హోంగార్డు రామారావు పరారయ్యాడు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
