కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశా.. కో ఆప్షన్ పదవి ఇవ్వండి

కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశా.. కో ఆప్షన్ పదవి ఇవ్వండి

  • కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పని చేశా..!
  • పట్టణ అధ్యక్షుడిగా,వార్డ్ మెంబర్ గా, సామజిక సేవకుడిగా పని చేస్తున్న..!

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన మండల కాంగ్రెస్ నాయకుడు ఎడ్ల శ్రీనివాస్ రాబోయే మున్సిపల్ కో ఆప్షన్ (నామినేటెడ్) ఎన్నికల్లో తనకు కో ఆప్షన్ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత 30 ఏండ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పని చేస్తున్నానని, 2006 లో వార్డ్ సభ్యునిగా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశానని వివరించారు. ఎన్ ఎస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్ లో అనేక పదవులు పొందినట్లు తెలిపారు.

1996లో గాంధీ పబ్లిక్ సిటీ వింగ్ లో వలిగొండ మండలం నాగారంలో జిల్లా ట్రైనర్ల శిక్షణా శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో, ఎన్నికల వేళ విస్తృతంగా పాల్గొన్నట్లు తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి కట్టుబడి ఉన్న తాను సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం కొనసాగుతున్నానని, ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తనను మున్సిపల్ కో ఆప్షన్ పదవికి ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఎడ్ల శ్రీనివాస్ కోరుతున్నారు.

Leave a Reply