పందిరి గుంజ పాతి ప్రత్యేక పూజలు

పందిరి గుంజ పాతి ప్రత్యేక పూజలు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం టౌన్ పరాసుపేటలో వెంచేసి యున్న శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 9 నుండి 17 వరకు జరుగు సందర్బంగా పందిరి గుంజను సోమవారం 8.10 నిమిషాలకు పాతటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి మోహనరావు, ఆలయ చైర్మన్ ఆలపాటి రమేష్, పాలక వర్గం సభ్యులు విశ్వనాధ పల్లి నాగరాజు, మానేపల్లి ఉషారాణి, మోపర్తి ఉమాదేవి, జంపాని కనక దుర్గా రాజేష్, నందిపాముల శ్రీనివాస్, ఐలా శివ నాగేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.
