HYD | షార్ట్ స‌ర్క్యూట్‌తో భ‌వ‌నంలో మంట‌లు

HYD | షార్ట్ స‌ర్క్యూట్‌తో భ‌వ‌నంలో మంట‌లు

HYD | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ఇవాళ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో భవనంలో 23 మంది నివాసితులు ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడం, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply