ఇంటర్‌లో కేజీబీవీ బాలికల సత్తా…

ఇంటర్‌లో కేజీబీవీ బాలికల సత్తా…

  • బాలికలను అభినందించిన ప్రత్యేక అధికారి సుమలత…

చిట్యాల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచారని , గురుకుల ప్రత్యేక అధికారి సుమలత ఆదివారం తెలిపారు. కేజీబీవీ లో ఇంటర్లో ప్రధమ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలను వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 97.8 శాతం, ప్రథమ సంవత్సరంలో 89.3 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సుమలత తెలిపారు.

ఎంపీ హెచ్ డబ్ల్యులో ద్వితీయ సంవత్సరంలో ఏం స్వాతిక,963/1000, బి వైష్ణవి, 957/1000, సి ఈ సి ద్వితీయ సంవత్సరంలో టి అంజలి, 912/1000, వి గౌతమి, 910/1000, ప్రథమ సంవత్సరం ఎం పి హెచ్ డబ్ల్యు లో చిలుకల అక్షర, 4 86/500, సిహెచ్ హన్సిక,469/500, సీఈసీ ప్రధమ సంవత్సరంలో సిహెచ్ వైష్ణవి ,422/500, బి అర్చన, 419/500 మార్కులు సాధించినట్లు సుమలత తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన బాలికలను స్పెషల్ ఆఫీసర్ సుమలత ఉపాధ్యాయ బృందం విద్యార్థుల, అభినందించారు.

Leave a Reply