ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి..

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి..
విజయవాడ, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ సమ స్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ ఈ నెల 21వ తేదీన జిల్లా కలెక్టర్ వద్ద, 25న రాష్ట్ర స్థాయిలో విజయవాడలో చేపట్టనున్న ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పి ఆర్ టి యు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్ జానీ, సోల రాఘవ రాజు కోరారు. జిల్లా అధ్యక్షులు షేక్ నవాబ్ జానీ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలోని కానూరు ప్రతిభ జూనియర్ కాలేజీ నందు జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఉపాధ్యాయుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన, పీఆర్సీ ఏర్పాటు, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ వర్తింపు, పెండింగ్ డీఏల విడుదల, పాత డీఏ బకాయిల చెల్లించి, మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమ స్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సోల రాఘవ రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరి రాజ శేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కొత్త హరిశరన్,మర్రి ప్రభాకర్,రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు జాకియా సుల్తానా, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనకళ్ల రమేష్,రాష్ట్ర కార్యదర్శి యూసఫ్, ప్రతిభ జూనియర్ కళాశాల డైరెక్టర్ సుధాకర్,ఆవుల రాంబాబు,గోపాల్, ఇర్ఫాన్ పాషా, బాజాని, నెహ్రూ, వివిధ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
