చెట్ల మధ్య చిక్కుకున్న సూచిక బోర్డు..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : “నన్ను చెట్ల మధ్యలో ఉంచితే ప్రమాదాలు జరుగుతాయి.. బయటికి తీస్తే వాహనదారులను హెచ్చరిస్తాను” అంటూ ఓ సూచిక బోర్డు మాటలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల నుంచి మండల కేంద్రానికి వెళ్లే రహదారిపై ఉన్న హై లెవెల్ బ్రిడ్జి వద్ద ఈ పరిస్థితి నెలకొంది.

బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డు చెట్ల మధ్య చిక్కుకుని కనిపించకుండా పోయింది. దీంతో వాహనదారులు ముందస్తు హెచ్చరిక లేకుండా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆ ప్రాంతంలో తరచూ చిన్నచితక ప్రమాదాలు జరుగుతున్నాయి.

సంబంధిత అధికారులు స్పందించి రహదారి పక్కకు వంగి ఉన్న సూచిక బోర్డును సరిచేసి, స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply