సత్తా చాటిన ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
ఆలేరు,ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరు విద్యార్థులు ఆదివారం తమ ప్రతిభను చాటి చెప్పారు.ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పి సృజన 991 మార్కులు సాధించింది. కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని బి మానస 961 మార్కులు పొందింది. ఎల్ అర్చన బైపిసి ఫస్ట్ ఇయర్ గ్రూపులో 421 మార్కులు సాధించింది.
జె మణిధర్ ఈటి గ్రూపులో 904మార్కులు పొందాడు.ప్రవీణ్ ఎల్ ఎం డి టి గ్రూపులో 906 మార్కులు సాధించాడు. పొందినాడు. ఎస్.కె అబ్దుల్ ముఖిత్ 808 బైపిసి, ఈ మనీషా సి ఎస్ గ్రూపులో 481 మార్కులు పొందింది.కళాశాల ప్రిన్సిపాల్ పూజారి వెంకటేశ్వర్లు విద్యార్థులను,అధ్యాపక బృందాన్ని అభినందించారు.
పేద విద్యార్థుల కోసం నాణ్యమైన విద్య ప్రభుత్వ కళాశాలలో లభిస్తుందని అన్నారు. సకల సౌకర్యాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నాణ్యమైన విద్యను అందించడానికి సిద్ధంగా ఉందని, దీనిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. కళాశాల అధ్యాపక బృందం అబ్బాస్, రాములు, మధు,జితేందర్ రెడ్డి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
