12aprilsplstory | విశ్వం చూస్తోంది దైన్యంగా!

12aprilsplstory | విశ్వం చూస్తోంది దైన్యంగా!

12aprilsplstory | అమెరికా-ఇరాన్ యుద్ధం అసలు పరిస్థితి
ట్రంప్ నిర్ణయాలు – ప్రపంచంపై ప్రభావం
కాల్పుల విరమణలో అయోమయం
ఇజ్రాయెల్ పాత్ర మరియు యుద్ధ తీవ్రత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
గ్లోబల్ లీడర్‌షిప్ వైఫల్యం

12aprilsplstory | యుద్ధం వల్ల ప్రపంచం సంక్షోభంలో పడుతుంది. కాని ఒకానొక యుద్ధమే సంక్షోభంలో పడితే? అమెరికా-ఇజ్రాయెల్కు ఇరాన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం పరిస్థితి ఇదే. ఇక ప్రపంచం సంగతి చెప్పేదే ముంది! ఏ సమస్యకైనా పరిష్కారం నాలుగడుగులు ముందుకి ఒకటి రెండడుగులు వెనక్కి లాగుతూ లాగుతూ చివరకు ఎక్కడో ఒకచోట కుదురుకుంటుంది. కాని ఈ యుద్ధం తీరే వేరు. నలభై రోజులుకు పైగా సాగలాగుతూ నిరంతర అగ్ని జ్వాలలు కురిపిస్తూ ముగింపు ఎక్కడో ఎలానో తేలకుండా పోతున్నది.

12aprilsplstory
12aprilsplstory

విడతల వారీ గడువులు ఒక అయోమయం గా మారిపోయాయి. తాజాగా ట్రంప్ రెండు వారాల గడువుతో కాల్పుల విరమణ ప్రకటించారు. ఇది తన ఏకపక్ష నిర్ణయం కాదన్న సంకేతాలు ఇచ్చారు. కానీ ఆయన తప్ప దీనిమీద సానుకూలంగా మాట్లాడిన వారెవరూ లేరు. అంతా తన అదుపాజ్ఞల్లో నడుస్తున్నదని చెప్పుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇరాన్ కూడా సమ భాగస్వామ్యంతో అంగీకరించిందన్న భావన స్పురించకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. అంతా తన మీద గానే తన కనుసన్నల్లోనే ఆ ఒప్పందం జరిగిందని ప్రపంచానికి చాటుతున్నారు. అందుకే ఇరాన్ మాటల్లో భిన్న ధోరణులు.

ఈ కాల్పుల విరమణ ఒక అయోమయపు అంకం లో కొట్టుమిట్టాడుతున్నది. ట్రంప్ తనకు గుర్తొచ్చినప్పుడల్లా గడువులు పెడుతున్నారు గాని అవేవీ ఆయనకు సుతరామూ ఇష్టం లేదని ఆయన వ్యవహారశైలి, భాషా ప్రయోగాలను బట్టి అర్థమవుతున్నది.

ఇరాన్ ను మట్టి కరిపించాలన్న కృతనిశ్చయం ఆయనలో గూడు కట్టుకుంది. ఇరాన్ నాగరికతను సమూలంగా తుడిచిపెట్టేస్తానని చేసిన ప్రకటన ట్రంప్ మనసులో ఉన్న కసి ని తెలియజేస్తున్నది.

ఇంతటి తీవ్రమైన పరుషమైన ప్రకటనలు ద్వారా ఇరాన్ ను దారికి తేవాలని ప్రయత్నించి ట్రంప్ పదేపదే విఫలమయ్యారు.

ఇజ్రాయెల్ మాత్రం మరింత కసితో విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందం గాలిలో ఊగిసలాడుతోంది.

ట్రంప్ మళ్లీ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక ఒప్పందం కుదిరినప్పుడు నాయకులు మౌనం పాటించడం ఒక న్యాయ సూత్రం. కాని ఇక్కడ అవేవీ పాటించడం లేదు.

ఈ మొత్తం త్రిభుజాకార యుద్ధంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ప్రపంచ శాంతి కోసం చేసిన తీర్మానాలు నిష్పలమై, ప్రపంచం మొత్తం దిక్కులేనిదిగా, దైన్యంగా చూస్తోంది!

-వయ్యస్సారెస్

Leave a Reply