పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే లక్ష్యం

పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే లక్ష్యం
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
శావల్యాపురం, ఆంధ్రప్రభ : పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా మంజూరైన సోలార్ ప్యానెల్ గ్రిడ్ అనుసంధానాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ వల్ల విద్యుత్ ఖర్చు పూర్తిగా తగ్గుతుందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలతో ఈ సౌర ఫలకాలను అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

