సామాజిక విప్లవ పితామహుడు పూలే….

సామాజిక విప్లవ పితామహుడు పూలే….

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ప్రజావేదిక కార్యాలయంలో ఘనంగా పూలే… ద్విశతాబ్ది జయంతి వేడుకలు
పూలే చిత్రపటానికి నివాళులర్పించిన… ఎమ్మెల్యే రాము,కూటమినేతలు
మహానీయులు చూపిన మార్గంలో నడవడం మన సామాజిక బాధ్యత….

గుడివాడ – ఆంధ్రప్రభ : సామాజిక విప్లవ పితామహుడు పూలే అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు మనకు ఎప్పటికీ ఆదర్శప్రాయులన్నారు. గుడివాడ ప్రజా వేదిక (టిడిపి) కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకలు(200)వ జయంతి వేడుకలు శనివారం ఉదయం ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు నివాళులు అర్పించి జోహార్ జ్యోతిరావు పూలే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పూలే, అంబేద్కర్, ఎన్టీఆర్ లాంటి మహానీయులు చూపిన మార్గంలో నడవడం మన సామాజిక బాధ్యత అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు పూలే అని కొనియాడారు.

సామాజిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఆ మహాత్ముని జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రవి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, బీజేపీ నాయకులు అంగడాల సతీష్, టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జి,పండ్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్, గుడివాడ జోన్స్ దయానంద్, పులవర్తి డేవిడ్ బాబు , నేరుసు కాశి, లోయ విజయ్, కరిముల్లా, వేశపోగు ఇమ్మానుయేలు, వంగపండు ఆదినారాయణ, యార్లగడ్డ సుధారాణి, సిరిపురపు తులసీరాణి, గొర్ల శ్రీలక్ష్మి, షేక్ జానీ, రెడ్డి షణ్ముఖ,పోట్లూరి కృష్ణారావు, పెద్ది బోయిన లక్ష్మీ నరసింహారావు, బాంబే శీను, నిరంజన్, షేక్ సర్కార్, ఏసుబాబు, రఫీ, దేవేంద్రుడు, అంజిరెడ్డి, ఉబ్బల వెంకటేశ్వరరావు, బసవయ్య, మాదాల సునీత, ప్రభాకర్ రెడ్డి, అందుగుల యేసు పాదం, వల్లభనేని రంగబాబు, నవాబు,ఈశ్వరరావు, కాటూరి శివాజీ, తెలుగు యువత, తెలుగు మహిళా, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply