లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత..

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు సంక్షేమ పథకాల అమలులో కానీ, అభివృద్ధి పనులలో కానీ ఒక్క రూపాయి అవినీతి జరగనివ్వనని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా రఘునాథపల్లి మండలానికి సంబందించిన 37మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 12లక్షల 52వేల విలువగల చెక్కులను పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, తహసీల్దార్ రాజేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిడివో, మండల ప్రజా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
