విద్యార్థులు యువత క్రీడా రంగాల్లో రాణించాలి..
విద్యార్థులు యువత క్రీడా రంగాల్లో రాణించాలి..
- ఊట్కూర్ సర్పంచ్ ఎం రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్,
- మేరా యోభారత్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; విద్యార్థులు యువత క్రీడారంగంలో రాణించడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఊట్కూర్ సర్పంచ్ ఎం రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్, మేరా యోభారత్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఆయా కాలనీలలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ కార్యక్రమం నిర్వహించి క్రీడా సామాగ్రి పంపిణీచేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న యువజన సంఘాలను మేరా యువభారత్తో అనుసంధానం చేయడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ అనుసంధానం ద్వారా యువజన సంఘాలకు అనేక అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తాయని అన్నారు. యువజన సంఘం సభ్యులకు వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, ఫ్రిస్బీ, స్కిప్పింగ్ వంటి క్రీడా సామగ్రిని అంబేద్కర్ యూత్, గాంధీ యూత్, సర్దార్ నగర్ యూత్, పాత పేట్ యూత్, శ్రీనివాస యూత్, శివాజీ యూత్, లాల్ బహదూర్ యూత్ లకు క్రీడా సామగ్రిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.మేరా యువభారత్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా గర్వకారణం అని, గ్రామ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
పలు యువజన సంఘాలకు క్రీడా సామగ్రి పంపిణీ చేయడం చాలా అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో యువజన సంఘాలను బలోపేతం చేసి, వారిని సామాజిక సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తాయని ప్రశంసించారు. జిల్లా వాలి బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జగదీష్ గౌడ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్, మద్యానికి,బానిస కాకుండా యువకులు క్రీడాలలో రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు రాధా కృష్ణయ్య గౌడ్ ,శివరామరాజు, ఉప సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్ నాయకులు క్రీడాకారులు రమేష్ , సందాపురం రవి, కొక్కు గౌతమ్, భానుచందర్, నరసింహ ,కొక్కు మల్లేష్, నరేష్ గౌడ్, బండి అశోక్, గోవర్ధన్ గౌడ్ ,తరుణ్, హరి,రాజేష్,సుమన్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
