Israel Airstrike : హమదాన్ సేఫ్ Andhra Prabha News

Israel Airstrike : హమదాన్ సేఫ్ Andhra Prabha News
- ఇజ్రాయెల్ వైమానిక దాడులు
- ఇద్దరికి తీవ్రగాయాలు
( ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి )

ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడుల్లో.. ప్రజాజీవితం అస్తవ్యస్తంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు అదిరింపులు, బెదిరింపులతో ఇరాన్ ను రెచ్చగొడుతుంటే.. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ పై హోరాహోరీ క్షిపణుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము లోపు అమెరికాతో రాజకీకి తలవంచకపోతే.. ఇరాన్ కు నరకం తప్పదని అమెరికా అయక్షుడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన తరుణంలో ఇరాన్ కూడా రెచ్చిపోయింది. ఇజ్రాయెల్ లోని హైఫా నగరంలోని జనవాసాలు, పోర్టుపై మంగళవారం ఉదయం దాడులకు దిగింది. ఈ ఘటనలో నలుగురు ఇజ్రాయేలీయులు మృతి చెందారు.12 మంది గాయపడ్డారు.
Israel Airstrike : బీబీ గోర్జీలో భయం భయం

ఇక ఇజ్రాయెల్ సైతం ప్రతిదాడికి దిగింది. ఇరాన్ లోని చారిత్రాత్మక, ప్రసిద్ధ హమదాన్ (Hamadan) నగరంలోని బీబీ గోర్జీ (Bibi Gorji) వీధిపై వైమానిక దాడి జరిపింది. భారత కాలమానం (IST) ప్రకారం మంగళవారం (ఏప్రిల్ 7, 2026) ఉదయం 08:30గంటలకు ఈ దాడి జరిగింది. బీబీ గోర్జీ వీధిలోని ఒక నివాస సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగింది.ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఇరాన్ తన డ్రోన్లను గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ వైపు ప్రయోగిస్తుండటంతో, ప్రతిస్పందనగా అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్ అంతర్భాగంలో ఈ దాడులు నిర్వహించాయి. ఇరాన్ రక్షణ దళాల ఉన్నతాధికారులు ఆ భవన సముదాయంలో ఉన్నారనే అనుమానంతో ఈ దాడి జరిగినట్లు సమాచారం.
Israel Airstrike : ప్రజల్లో టెన్షన్ టెన్షన్

హమదాన్ సమీపంలోనే ఇరాన్ కీలక షాహ్రోఖీ (Shahrokhi) ఎయిర్ బేస్ ఉండటంతో నగరం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. గల్ఫ్ దేశాలపై ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేస్తున్న వరుస క్షిపణి దాడులకు ప్రతిచర్యగా అమెరికా, ఇజ్రాయెల్ జమ్మూ-ఇరాన్ వ్యాప్తంగా ఇలాంటి దాడులు చేస్తున్నాయి. హమదాన్ నగరంలో ప్రస్తుతం సహాయక చర్యలునసాగుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఈ దాడిని “పౌరులపై జరిగిన దురాగతం”గా అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో, ఇరాన్ లోని ప్రధాన నగరాలపై దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
