గుండె జబ్బులపై అవగాహన…

గుండె జబ్బులపై అవగాహన…

పాయకాపురం, ఆంధ్రప్రభ : నడక ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోవచ్చని వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ కె.శ్రీనివాసరాజు, ఎలెక్ట్ గవర్నర్ ఎన్. బి.జి. ఎమ్ ప్రసాద్ అన్నారు. అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య మల్టీ పుర్పస్ స్టేడియంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాకర్స్ ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సాయి ప్రకాష్ పాల్గొని గుండె వ్యాధులుకు సంబంధించిన అనేక విషయాలు వివరించి, ఉచితంగా ఈ. సి. జి పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజూ నడక నడవడం ద్వారా గుండె, మెదడు సమత్యుల్యంలో పని చేస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్ కె. ఎస్. ఎన్ మూర్తి, కార్యదర్శి కోన కుటుంబరావు, ట్రెజర్ సూర్యనారాయణ, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply