మొగ్ధూంపూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం….

మొగ్ధూంపూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం….

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్దుమ్ పూర్ లో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సర్పంచ్ తిరుమలేష్, బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షులు అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుమలేష్ మాట్లాడుతూ దేశ సమగ్రాభివృద్ధికి బీజేపీ ఎంతోకృషిచేస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ పార్టీ ప్రతిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దేశ సమగ్రత నైతిక విలువలు సంస్కృతి సంప్రదాయాలు కాపాడడం బీజేపీ పార్టీకే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయడంతో పాటు కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్ నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాసులు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply