భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భీమ్‌గల్‌ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంతో పాటు మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకులు ఘనంగా సంబురాలను నిర్వహించారు. బీజేపీ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ఏ.మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు కనికరం.మధు మండల అధ్యక్షుడు ఆరే.రవీందర్ ఆధ్వర్యంలో బస్టాండ్ లో బీజేపీ గద్దె వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జెండాను ఆవిష్కరించి, పార్టీ సిద్ధాంతాలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా పట్టణ, మండల, అధ్యక్షులు మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో బీజేపీ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పాత్రను నాయకులు కొనియాడుతు, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ మల్లికార్జున్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ గోదావరి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్, బీజేపీ కౌన్సిలర్ క్యాండిడేట్స్ పట్టణ ప్రధాన కార్యదర్శిలు నవీన్, దయ ప్రవీణ్, మండల బీజేవైఎం అధ్యక్షుడు శెట్టి ప్రేమ్చంద్, రైతు అధ్యక్షుడు తోట గంగాధర్,గణేష్ (గణ,) నవీన్, గంగాధర్ గౌడ్, హరిప్రసాద్, మోహన్, గోపు అంజి, బండి నర్సయ్య, సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply