Hezbollah Missile Attack : హిజ్బుల్లా క్షిపణి దాడి Andhra Prabha News

Hezbollah Missile Attack : హిజ్బుల్లా క్షిపణి దాడి Andhra Prabha News

  • మధ్యధరా సముద్రంలో ఉద్రిక్తత
  • నౌకను తాకిన క్షిపణి
  • ఆపరేషన్ డెవౌర్డ్ స్ట్రా ప్రతీకారం
  • ప్రాణనష్టం వివరాలపై ఇజ్రాయెల్ మౌనం

(ఆంధ్రప్రభ. జెరుసలేం ప్రతినిధి)

Hezbollah Missile Attack : హిజ్బుల్లా సాయుధ బృందం ఇజ్రాయెల్ యుద్ధనౌకపై నావికా క్రూయిజ్ క్షిపణితో దాడి చేసినట్లు ప్రకటించింది. 2026 ఏప్రిల్ 5, ఆదివారం తెల్లవారుజామున హిజ్బుల్లా దళాలు ఇజ్రాయెల్ యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశాయి. లెబనాన్ తీరానికి సుమారు 68 నాటికల్ మైళ్ల దూరంలో మధ్యధరా సముద్రంలో ఈ దాడి జరిగింది. ఒక నావికా క్రూయిజ్ క్షిపణినిప్రయోగించింది. లెబనాన్ భూభాగంపై దాదికి సిద్ధమవుతుండగా క్షిపణిని ప్రయోగించినట్లు హిజ్బుల్లా బృందం పేర్కొంది. ఈ క్షిపణి నేరుగా నౌకను తాకిందని (Direct Hit), దీనివల్ల నౌకలో మంటలు చెలరేగాయని హిజ్బుల్లా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడి లో ప్రాణనష్టం ఆస్తి నష్టంపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. లెబనాన్‌లోని మౌలిక సదుపాయాలు జనవాసాలపై ఇజ్రాయెల్​ దాడులకు ప్రతీకారంగా ఈ “ఆపరేషన్ డెవౌర్డ్ స్ట్రా” (Operation Devoured Straw) చేపట్టినట్లు హిజ్బుల్లా వెల్లడించింది.

Leave a Reply