ధ్యానంతో ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉండొచ్చు..

ధ్యానంతో ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉండొచ్చు..
జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ధ్యానంతో ఒత్తిడిని జయించి మానసిక మానసిక ప్రశాంతత పొందవచ్చని హెచ్. ఎఫ్. ఎన్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోహార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి హృదయం ధ్యానం చేయాలి- ప్రతి దినము ధ్యానం చేయాలి అనే లక్ష్యముతో, హార్ట్ ఫుల్ నెస్ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ధ్యానం ద్వారా ఒత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చని అంతర్గత శాంతి నుంచి ప్రపంచ శాంతి వైపు అడుగులు వేయవచ్చని అన్నారు. ధ్యానం చేయడం వలన ఒత్తిడి తొలగి ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. నిత్యం ధ్యానం చేయడం వల్ల శారీరక మానసిక ఎదుగుదల వస్తుందని, మనిషి సన్మార్గంలో నడుచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ నారాయణరెడ్డి, సుజాత, రమాదేవి, సునీత, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
