ఆదర్శనీయులు …బాబు జగజ్జివన్ రావు

ఆదర్శనీయులు …బాబు జగజ్జివన్ రావు

ఘన నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

నర్సాపురం, ఆంద్రప్రభ : సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కేంద్ర మంత్రిగా సేవలందించిన దివంగత నేత బాబు జగజ్జివన్ రావు ఆదర్శనీయులు అని రెవెన్యూ డివిజనల్ అధికారి దాసి రాజు అన్నారు. బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్ డి ఓ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవనరావు అని కొనియాడారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు.

స్వాతంత్ర్య సమరంలో ఆయన పోషించిన పాత్రతో పాటు, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దేశ అభివృద్ధికి చేసిన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. తహసీల్దార్ అయితం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాబు జగజ్జీవనరావు ఆదర్శాలను పాటిస్తూ సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘన నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు..

దివంగత నేత బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా నియోజక వర్గంలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు ఆయా పార్టీ కార్యాలయంలలో ఆయన చిత్ర పటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో యువత నడుచుకొని సమాజ సేవలలో భాగస్వామి కావాలని సూచించారు.

నివాళులు అర్పించిన వారిలో టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామరాజు, ఏ ఎం సి చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, ఆకన సుబ్రహ్మణ్యం, దొంగ శ్రీరామచంద్రుడు, అడబాల నాగ మురళి కృష్ణ, జంపన జగన్నాధ రాజు, మెర్సీ, సుబ్బలక్ష్మి, రోజారాణి, వంగలపూడి యేసయ్య, మెరిపి మోజేష్, శేఖర్, తిరుమాని హేమంత, నాగిడి రాంబాబు, కార్యకర్తలు పాల్గొని బాబు జగజ్జివన్ రావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply