దొంగల కలకలం..

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలంలోని ఎండ్రియల్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున దొంగతనం కలకలం రేపింది. గ్రామ పంచాయితీ సమీపంలో నివసించే బాణాల అనసూయ అనే మహిళ ఉదయం 3:55 గంటలకు వాకిలి ఊడ్చేందుకు ఇంటి గేటు తీస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసును కత్తిరించి పరారయ్యాడు. బాధితురాలు గ్రామస్థులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు. చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply