శారాజిపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

శారాజిపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా చూసి ప్రతిరోజు తప్పనిసరిగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా అంతర్గత పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

ఆసుపత్రికి ప్రతిరోజు ఓపి రోగులు ఎంతమంది వస్తున్నారు, వారి వివరాలు ఎక్కడ ఎలా నమోదు చేస్తున్నారో చూపాలని వైద్యులను, సిబ్బందిని ప్రశ్నించారు. ఆసుపత్రి సిబ్బంది దినసరి హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. మందులు ఆసుపత్రిలో రోగులకు సరిపోయే విధంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇస్తున్న మందులకు సంబంధించిన నమోదు రిజిస్టర్లలో జరుగుతుందా అని కూడా కలెక్టర్ ప్రశ్నించారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. రోగులకు సత్వర వైద్య సేవలు అందించడానికి వైద్యులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మనోహర్, తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply