Incident | గ్రామంలో భయాందోళన

Incident | గ్రామంలో భయాందోళన

Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర రాష్ట్రంలోని జల్గావ్ జిల్లా మమల్దే గ్రామ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట తల్లి పక్కన నిద్రిస్తున్న రెండు నెలల పసికందును చిరుతపులి ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.

తెల్లవారుజామున చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా, సమీపంలోని పొలాల్లో చిన్నారి శరీర అవశేషాలు కనిపించాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు.

ప్రాథమిక విచారణలో చిరుతపులి దాడి చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Leave a Reply