మడూరు స్టేజ్ వద్ద ఎక్స్ బస్సులను ఆపాలి

మడూరు స్టేజ్ వద్ద ఎక్స్ బస్సులను ఆపాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలోని నాంచారి మడూరులో రిక్వెస్ట్ స్టాప్, తొర్రూరు, ఖమ్మం, సూర్యాపేట, హనుమకొండ ఎక్స్ ప్రెస్ ఎలక్ట్రానిక్ బస్సులను ఆపాలని నాంచారి మడూరు గ్రామ సర్పంచ్ బంగారు రమేష్ కోరారు. సోమవారం డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామంలోకి చుట్టుపక్కల మండలాల నుండి నాంచారి మడూరుకు వచ్చి వ్యాపార రిత్య, అవసరాల నిమిత్తం గ్రామాల నుండి వచ్చి వెళ్తుంటారని, వరంగల్, హనుమకొండకు వెళ్లడానికి ప్రజలు నాంచారి మడూరుకు వస్తారని, కావున ఎలక్ట్రానిక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను ఆపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 4,6,7వ వార్డు సభ్యులు దికొండ శ్రీనివాస్, మంద గణేష్, గిద్దె నీరటి జీవన్, సీనియర్ జర్నలిస్టు ఆకుతోట యాకన్న, మంద యాకమల్లు, దానం భరత్, మేకల మధు నలమాస శంకర్, ప్రవీణ్ రవీందర్, రమేష్, నల మాససంపత్, మడి పెద్దియశ్వంత్, పరమేష్, అశోక్, వినీత్, విజయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
