మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ లో రూ.10 లక్షలతో మహిళ సమాఖ్య భవనానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, ఏ ఎం సి చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, టిపిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్,ఐకేపీ సిబ్బంది తో పాటు మహిళా సంఘ సభ్యులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.రూ.10 లక్షలతో మహిళ సమాఖ్య భవనానికి భూమీ పూజ చేశారు.మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందని అన్నారు.
మహిళలు ఆత్మ గౌరవంగా ఉండాలని మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైకాన్ జమున మహేష్,పడిగేల ప్రవీణ్, సెక్రెటరీ నరేందర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
