ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలకు మెరుగైన పాలన…

ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలకు మెరుగైన పాలన…

సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్..

వెల్దండ, ఆంధ్రప్రభ : ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలకు మెరుగైన సదుపాయలు అందిస్తునామని స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు. వెల్దండ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా సోమవారం మోత్కూ పార్వతమ్మకు ఇందిరమ్మా ఇల్లు మంజూరైనా సందర్బంగా ఇంటి నిర్మాణానికి భూమిపూజా కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో అరుహులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్, కార్యదర్శి గిరి గౌడ్, వార్డు సభ్యులు మారేపల్లి మంజుల శ్రీను, ముదికొండ రమేష్, నాయకులు కొయ్యల పుల్లయ్య, తుంగ శ్రీను ,క్యాసరపు మల్లేష్, ఉడుత వెంకయ్య,జంగిలి ఆనంద్ , ఉడుత పరమేష్, డేవిడ్, మట్ట మల్లేష్ ,రాజు,లింగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply