జయరాజ్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి

జయరాజ్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి
- నిమ్స్ వైద్యులకు మంత్రి దామోదర్ ఆదేశం
- ప్రజా కళాకారుడు జయరాజును పరామర్శ
- మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా కళాకారుడు జయరాజ్‌ను శనివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. జయరాజ్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తూ, ఆయన త్వరగా కోలుకునేలా చూడాలని సూచించారు..ఈ సందర్భంగా జయరాజ్ కుటుంబ సభ్యులకు మంత్రి ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
