రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన ట్రాన్స్‌ఫార్మర్!

రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన ట్రాన్స్‌ఫార్మర్!
-గడ్డి మధ్యలో కప్పబడి గుర్తుపట్టలేని స్థితి
-కిందకు కుంగిపోవడంతో మరింత పెరిగిన ప్రమాదం
-ఎర్తింగ్ సమస్యలతో భూమిలోకి విద్యుత్ ప్రవాహం
-రోజూ పొలాల్లోకి వెళ్లే రైతుల్లో ఆందోళన
-సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి
-ట్రాన్స్‌ఫార్మర్ తొలగించి సురక్షిత ప్రదేశంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్ర పరిధిలోని పంట పొలా ల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రస్తుతం రైతుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్‌ఫార్మర్ కాలక్రమేణా కిందకు కుంగిపోవడంతో పాటు, దాని చుట్టూ గడ్డి అధికం గా పెరిగి పూర్తిగా కప్పేసింది. దీంతో ఇది కనిపించకుండా ఉండటం రైతులకు మరింత ప్రమాదాన్ని పెంచుతోంది. ప్రతిరోజూ వ్యవసాయ పనుల కోసం పొలాల్లోకి వెళ్లే రైతులు తెలియకుండానే ట్రాన్స్‌ఫార్మర్ సమీపానికి చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో ఎర్తింగ్ సమస్యల కారణం గా విద్యుత్ ప్రవాహం భూమిలోకి వెళ్లి షాక్‌కు గురయ్యే ప్రమాదం నెల కొంది. ఈ పరిస్థితి రైతుల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. ఎప్పు డైనా అనుకోని ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడి నుంచి తొలగించి, రోడ్డు పక్కన లేదా సురక్షిత ప్రదేశంలో మళ్లీ ఏర్పాటు చేయా లని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ఎప్పుడైనా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
