Parliament | గ్యాస్ సిలిండర్లతో కేంద్రంపై విమర్శలు

Parliament | గ్యాస్ సిలిండర్లతో కేంద్రంపై విమర్శలు

Parliament | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ‘ఇండియా’ కూటమికి చెందిన ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు ఖాళీ హామీలే ఇస్తోందని విమర్శించారు.

పెరుగుతున్న నిత్యవసర ధరలు, నిరుద్యోగ సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపీలు నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనతో పార్లమెంట్ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply