Trivikram | టార్గెట్ ఫిక్స్..

Trivikram | టార్గెట్ ఫిక్స్..
Trivikram | త్రివిక్రమ్ – వెంకటేష్ ఆదర్శ కుటుంబం మూవీ దసరా టార్గెట్
గాడ్ ఆఫ్ వార్ మూవీ – ఎన్టీఆర్ బర్త్‌డే రోజున అనౌన్స్ మెంట్?
అల్లు అర్జున్, అట్లీ, లోకేష్ ప్రాజెక్ట్స్ తో మారిన ప్లాన్
పాన్ ఇండియా టార్గెట్‌తో త్రివిక్రమ్ కొత్త నిర్ణయం
రామాయణం సినిమాతో సంచలనం సృష్టించాలన్న ప్లాన్
పౌరాణిక సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై త్రివిక్రమ్ ఫోకస్
Trivikram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పటి వరకు అద్భుతమైన సంభాషణలతో.. అదిరిపోయే సినిమాలు అందించారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో.. ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని దసరాకి (Dasara) విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తన తోటి డైరెక్టర్స్ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. త్రివిక్రమ్ ఇంకా టాలీవుడ్ కే పరిమితం అయ్యారేంటి..? అనే డౌట్ అభిమానుల్లో ఉంది. అయితే.. ఇప్పుడు త్రివిక్రమ్ ప్లాన్ మారిందని.. టార్గెట్ ఫిక్స్ అయ్యిందని తెలిసింది. ఇంతకీ.. త్రివిక్రమ్ ఏం చేయబోతున్నారు..?

Trivikram | మే 20న అనౌన్స్ మెంట్..?
త్రివిక్రమ్.. గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలి అనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా బన్నీ.. అట్లీతో (Atlee) సినిమాని చేయడానికి ఓకే చెప్పడంతో.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒప్పించారు. ఆతర్వాత మళ్లీ ఈ ప్రాజెక్ట్ లోకి బన్నీ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం మొదలైంది. అయితే.. బన్నీ అట్లీతో సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. దీంతో గాడ్ ఆఫ్ వార్ మూవీలో ఎన్టీఆరే నటిస్తాడని మళ్లీ ప్రచారం మొదలైంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్ ని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.

Trivikram | త్రివిక్రమ్.. రామాయణం..
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్.. ఇక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టేసి పాన్ ఇండియా (Pan India) టార్గెట్ గా పౌరాణిక చిత్రాలు చేయాలని ఫిక్స్ అయ్యారట. అలాగే రామాయణం కూడా తీయాలి అనుకుంటున్నారట. ఆయన రామాయణం తీస్తే.. మరోలా ఉంటుందని.. ఎవరూ చెప్పని కోణంలో.. సరికొత్తగా తెరకెక్కిస్తారని.. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో థమన్ చెప్పాడు. గాడ్ ఆఫ్ వార్ కథే కాకుండా రామాయణం కథ కూడా రెడీ చేసారట త్రివిక్రమ్. ఈ రెండే కాకుండా.. పౌరాణిక కథలు వరుసగా తీసేలా కథలు రెడీ చేస్తున్నారట. మొత్తానికి త్రివిక్రమ్ ప్లాన్ మారింది.. టార్గెట్ ఫిక్స్ అయ్యింది. మరి.. పౌరాణిక చిత్రాలతో.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

