20thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
20thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
20thMarchCartoon | గ్యాస్ సంక్షోభం తీవ్రత ఏ స్థాయిలో ఉంది?
కేంద్ర హామీలు vs వాస్తవ పరిస్థితి
కార్టూన్లో వ్యంగ్యాస్త్రం ఏమి చెబుతోంది?
సామాన్యులపై ప్రభావం ఎలా ఉంది?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : త్వరలో గ్యాస్ కష్టాలు తీరుస్తామని కేంద్రం భరోసా ఇస్తున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పశ్చిమాసియాలో పడుతున్న ఒక్కోబాంబూ భారతీయుల గుండెల్లో దడపుట్టిస్తోంది…ఎందుకంటే ఇప్పటికే ముదురుతున్న గ్యాస్ సంక్షోభంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్న్యాయాలవైపు వెళ్ళలేక, నానా అగచాట్లు పడుతున్నారు.
ఎల్పీజీ నౌకలు మూడు భారత్ కు చేరుకున్నాయన్న వార్త కొంత ఊరట కలిగించినా, అది ఇప్పుడిప్పుడే ఇళ్ళళ్ళోకి చేరుతుందనీ, అందర్కీ కావలసినంత గ్యాస్ సరఫరా చేసేసి అమాంతం కొరత తీర్చేస్తుందనీ చెప్పలేం. పైగా ఆ గ్యాస్ ని ఎవరెవరికి, ఏయే అవసరాలకు, ఏయే రాష్ట్రాలకు అందించాలనేదానిపై కేంద్రం వద్దకూడా కొన్ని సమీకరణలు ఉంటాయి కదా…
ఈ పరిణామాలపై ఆంధ్రప్రభ కార్టూనిస్ట్ మాధవ్ సంధించిన వ్యంగ్యాస్త్రమే ఈ కార్టూన్. గ్యాస్ కొరత కింద సామాన్యులు నలిగిపోతూంటే కేంద్రం అభయమిస్తున్న దృశ్యం, ఈ సమస్య తీవ్రతను ప్రతిబింబిస్తోంది.
గత రెండు దశాబ్ధాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.
