cricketer | తండ్రయిన టీమిండియా మాజీ వికెట్ కీపర్
cricketer | తండ్రయిన టీమిండియా మాజీ వికెట్ కీపర్
సోషల్ మీడియా వేదికగా దినేశ్ కార్తీక్ వెల్లడి
2015లో దీపిక పల్లికల్‌తో వివాహం
2021లో కవల అబ్బాయిలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రి అయ్యాడు. ఇతని భార్య, ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియాలో వారు ప్రకటించారు. పాపకు ‘రాహా పల్లికల్ కార్తీక్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించింది.
“మా హృదయాల్లో ఆశీస్సులు, మాటలకు అందని కృతజ్ఞతతో మా అమూల్యమైన అమ్మాయిని ఈ ప్రపంచంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నాం. కబీర్, జియాన్ తమ చెల్లెలు రాహాను పరిచయం చేయడానికి ఎంతో థ్రిల్‌గా ఉన్నారు” అంటూ కార్తీక్, దీపిక తమ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ దంపతులకు 2015లో వివాహం కాగా, 2021లో కబీర్, జియాన్ అనే కవల అబ్బాయిలు జన్మించిన విషయం తెలిసిందే.
