చిన్నారుల చేతుల్లో పాఠశాల పాలన..

చిన్నారుల చేతుల్లో పాఠశాల పాలన..

పంతులుపల్లిలో స్వయం పాలనా దినోత్సవం సందడి”

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులే హెడ్మాస్టర్లు,ఉపాధ్యాయులు… నాయకత్వ నైపుణ్యాలకు వేదికగా నిలిచిన ప్రత్యేక కార్యక్రమం నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామ పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలనా దినోత్సవం ఉత్సాహంగా,వైభవంగా నిర్వహించబడింది,ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ బాధ్యతలను స్వీకరించి పాఠశాల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయులు కూనమళ్ల రాజన్ బాబు మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాధారపు శివాని హెడ్మాస్టర్‌గా బాధ్యతలు చేపట్టగా,ఎర్ర లాస్య సర్పంచ్‌గా వ్యవహరించారు,ఏఏపీసీ చైర్మన్‌గా బైరి ప్రసన్న, ఉపాధ్యాయులుగా నేతునూరి వర్షిత,రాధారపు రుత్విక్ తేజ తమ పాత్రలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఎరుకల లలిత,ఏఏపీసీ చైర్మన్ ఎరుకల వెంకటలక్ష్మి పాఠశాలను సందర్శించి, స్వయం పాలనా దినోత్సవంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులను అభినందించారు,విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు…

Leave a Reply