కల్వకుర్తి నియోజకవర్గం పాఠశాలకు నిఘా కేంద్రాల వితరణ

వెల్దండ, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని రాచూర్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సోమవారం గ్రామ సర్పంచ్ గున్నేల్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిఘా కేంద్రాలను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణం దేవాలయంతో సమానం అంటూ పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా యుగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

అనంతరం మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పాఠశాల సిబ్బందికి వంట సిబందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గోదా ప్రేమ్ కుమార్, మల్లేష్, శ్రీను, ప్రధాన ఉపా ధ్యాయులు జంగయ్య, ఉపాధ్యా యులు, కిషన్ రావు, మురళీ మనోహర్, జైపాల్, సురేష్ జనార్ధన్ అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply