ఘనంగా మల్లన్న పెద్ద పట్నాలు
ఘనంగా మల్లన్న పెద్ద పట్నాలు
-మల్లన్న ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
-మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రార్థించారు. ఆదివారం స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామంలో నిర్వహి స్తున్న మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మల్లన్న పెద్ద పట్నాల కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూ ర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్బంగా మల్లి కార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంత రం ఎమ్మెల్యే మాట్లాడారు. భక్తి శ్రద్దలతో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామ అభివృద్ధిలో సైతం గ్రామ ప్రజలందరూ కలిసి ఉండాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బేతి జైపాల్ రెడ్డి, రాపోలు మధు సూదన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మార పాక సుజన శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎడమ కట్టమల్లు, మార్కెట్ డైరెక్టర్ మారపాక వసంత్, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
