వృద్దుడిని బైక్ ఢీకొట్టడంతో..

వృద్దుడిని బైక్ ఢీకొట్టడంతో..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇచ్చింతుల రాజ కొమురయ్య (65) అనే వృద్ధుడు మండల కేంద్రంలోని పెట్రోల్ పంప్ సమీపంలో బైక్ ఢీకొట్టడంతో.. శనివారం రాత్రి మృతి చెందాడు. ఎస్సై అమూల్య తెలిపిన వివరాల ప్రకారం.. రాజకొమురయ్య టేకుమట్ల చెరువు కింద పొలాలకు వెళ్లి రోజులాగే నీరు పెట్టి (కూలి పని) ఇంటికి వెలుతున్న సమయంలో మండలంలోని రాఘవారెడ్డిపేట గ్రామానికి చెందిన గంటికోట ఉమేందర్ తన పల్సర్ బైక్తో వెనక నుండి ఢీకొట్టడంతో.. కిందపడిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై అమూల్య వెంటనే తన వాహనంలో (కొంత దూరం తర్వాత.. అంబులెన్స్ ద్వారా) చిట్యాల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాజ కొమురయ్య మృతి చెందాడు.

