ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్ల పంపిణీ…

ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్ల పంపిణీ…
మతసామరస్యానికి కట్టుబడి ఉండాలని పిలుపు
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతంలోని జిల్లా పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న మసీదు వద్ద పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మతసామరస్యం మరింత బలపడాలని, హిందూ–ముస్లింలు అన్నదమ్ములుగా కలిసి జీవించాలని అన్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మసీదులో ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు ముగించుకున్న వారికి ఖర్జూర పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ్ సాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు, నాయకులు కోడూరు ఆంజనేయ వాసు, జాస్తి సురేష్, బత్తుల దుర్గారావు, మల్లెల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


