జనహృదయనేత శీనన్నకు కన్నీటి వీడ్కోలు

జనహృదయనేత శీనన్నకు కన్నీటి వీడ్కోలు

  • అంతిమయాత్రలో అశేష జనవాహిని
  • భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లాలో జనహృదయ నేతగా గుర్తింపు పొందిన అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి (శీనన్న)కు గ్రామ ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మృతితో అభిమానులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై దుఃఖసాగరంలో మునిగిపోయారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన తమ అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలకడానికి భారీగా తరలివచ్చిన ప్రజలతో అమ్మపల్లి గ్రామం జనసంద్రంగా మారింది.

ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు. శ్రీనివాస్ రెడ్డి మరణం వ్యక్తిగతంగా తనకు, ప్రజలకు, పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి, గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, రఘుపతి రెడ్డి, రాజమహేంద్ర రెడ్డి, వేణు యాదవ్, బాలేశ్వర్ రెడ్డి, కుమార్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సేనాపతి, పురుషోత్తం రెడ్డి, చిట్యాల రాము తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.


Leave a Reply