ipl 2026| ఐపీఎల్‌కు హర్షిత్ రాణా దూరం?

ipl 2026| ఐపీఎల్‌కు హర్షిత్ రాణా దూరం?
గాయం నుంచి కోలుకోని పేసర్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు పేసర్ హర్షిత్ రాణా జట్టుకు దూరమయ్యాడని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు అతడు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణా మోకాలికి గాయమైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ కారణంగా ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌కు రాణా దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అతడి స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ రిప్లేస్‌మెంట్‌గా తీసుకోలేదు.
