పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శనివారం వరంగల్ నగరంలోని కరిమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆర్డీఓ సుమా, తహసిల్దార్ ఇక్బాల్ తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు తనిఖీ చేశారు.

పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, ఇతర అవసరమైన సదుపాయాలు తదితర అంశాలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షల నిర్వహణలో నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. తనిఖీల సందర్భంగా సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply