10th exame| ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభం

ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో చీఫ్​ సూపరిండెంట్​లు, డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు, అడిషనల్​ డిపార్టమెంట్​ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లలతో పాటు సిట్టింగ్ స్క్వాడ్లు ​పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేయనున్నారు.

ఎగ్జామ్‌ సెంటర్​లో అధికారులు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం కేంద్రాల్లో నీరు, విద్యుత్​ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే చికిత్స అందించేందుకు ప్రతీ కేంద్రం వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులు పరీక్షలు జ‌రుగుతున్నాయి. పోలీసుల బందో​బస్తు ఏర్పాటు చేసి బిఎన్​ఎస్​ఎస్​ 163 చట్టాన్ని అమలు చేశారు. కేంద్రాల్లో మాస్​​ కాపీయింగ్​ జరగకుండా స్క్వాడ్​తో తనిఖీలు నిర్వహించారు.

Leave a Reply