పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలి
జుక్కల్ విద్యాశాఖ అధికారి తిరుపతయ్య
జుక్కల్ కామారెడ్డి, ఆంధ్రప్రభ : మార్చ్14 నుండి జరిగే పదవ తరగతి పరీక్షల కోసం జుక్కల్ లో పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య అన్నారు.జుక్కల్ మండలంలో మొత్తం 359 మంది విద్యార్థిని,విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,జుక్కల్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో 220 మంది, కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయ పరీక్ష కేంద్రంలో 139 మంది పరీక్షలు రాయనున్నారని,వీరందరికీ మౌలిక వస్తువులు కల్పించడమే కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, వైద్య ఆరోగ్యశాఖ సైతం తమ సేవలు అందిస్తుందని,పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ 144 సెక్షన్ విధించడం జరిగిందని,కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన కోరారు.
