Megastar | కొత్త దర్శకుడితో మూవీ చేయనున్నారా..?

Megastar | కొత్త దర్శకుడితో మూవీ చేయనున్నారా..?
Megastar | బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ ప్లాన్స్
విశ్వంభర రిలీజ్ డేట్ పై క్లారిటీ
బాబీ, శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమాలు
సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయతో కొత్త ప్రాజెక్ట్
చిరంజీవి లైనప్ పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ
Megastar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరుకు ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించారు. అయితే.. స్టార్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్, సక్సెస్ లో ఉన్న దర్శకులతో (Produsers) సినిమాలు చేసారు కానీ.. కొత్త దర్శకుడితో చిరంజీవి సినిమా చేయలేదని అంటుంటారు సినీ జనాలు. ఇప్పుడు చిరంజీవి కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకే చెప్పారనే వార్త అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. చిరంజీవిని మెప్పించిన ఆ కొత్త దర్శకుడు ఎవరు..? నిజంగానే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందా..? ఎప్పుడు ఈ మూవీ స్టార్ట్ కానుంది..?

Megastar | బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..
మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్.. విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఈమధ్య చిరంజీవి సీనియర్ డైరెక్టర్స్ కంటే.. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ (Block Buster) అవ్వడం తెలిసిందే. ఆతర్వాత మరో యంగ్ డైరెక్టర్ అండ్ హిట్ మిసన్ అనిల్ రావిపూడితో మన శంకర్ వరప్రసాద్ గారు చేసి.. సరికొత్త రికార్డులు సెట్ చేశారు.

Megastar | విశ్వంభర జులై 10న రిలీజ్..?
అలాగే బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తో.. విశ్వంభర మూవీ చేశారు. ఈ సినిమా జులై 10న థియేటర్స్ (Theatre) లోకి వచ్చేందుకు రెడీ అవుతుందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఉగాది రోజున ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ మూవీ తర్వాత మళ్లీ బాబీతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. కెవిఎన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. అలాగే మరో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథకు కూడా చిరు ఓకే చెప్పారు. ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని నిర్మిస్తుండడం విశేషం.

Megastar | సుకుమార్ శిష్యుడుతో..
ఇప్పుడు కొత్తగా సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు శ్రీనివాస్ మాయ చెప్పిన కథకు ఓకే చెప్పారట. ఇది రంగస్థలం తరహాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. శ్రీనివాస్ (Srinivas) మాయ చెప్పిన కథ ప్రెష్ గా ఉండడంతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమా స్టార్ట్ కావడానికి టైమ్ పడుతుంది. విశ్వంభర జులైలో వస్తుంది. ఆతర్వాత బాబీతో చేసే సినిమా స్టార్ట్ కానుంది. ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఆతర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయాలి. ఈ సినిమా 2028లో రిలీజ్ కావచ్చు. సో.. నూతన దర్శకుడు శ్రీనివాస్ మాయతో సినిమా చేయాలంటే.. టైమ్ పడుతుంది. అసలు.. ఈ ప్రాజెక్ట్ నిజంగా ప్రచారంలో ఉన్నట్టుగా ఉందా..? లేదా..? అనేది త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

